కౌలురైతు ఆత్మహత్య | lease farmer suicide | Sakshi
Sakshi News home page

కౌలురైతు ఆత్మహత్య

Dec 30 2016 10:24 PM | Updated on Sep 4 2017 11:58 PM

మండల కేంద్రమైన దొర్నిపాడులో శుక్రవారం తెల్లవారుజామున బత్తులనాగన్న (45) అనే కౌలురైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

దొర్నిపాడు: మండల కేంద్రమైన దొర్నిపాడులో శుక్రవారం తెల్లవారుజామున బత్తులనాగన్న (45) అనే కౌలురైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దొర్నిపాడు ఏఎస్‌ఐ బాలచంద్రుడు చెప్పిన వివరాల మేరకు.. బత్తులనాగన్న ఈ ఏడాది తనకున్న 2 ఎకరాల సొంతపొలంతోపాటు 4ఎకరాలు కౌలుకుతీసుకుని పత్తిపంట సాగుచేశాడు. పెట్టుబడుల కోసం రూ.లక్ష రూపాయల వరకు అప్పులు చేశాడు. గతంలో పంట పండించేందుకు చేసిన అప్పులు, ప్రస్తుతం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు.  చుట్టుపక్కల రైతులు గమనించి చికిత్స కోసం.. నంద్యాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement