భక్తులపై పోలీసుల ప్రతాపం | lati charge on devoties | Sakshi
Sakshi News home page

భక్తులపై పోలీసుల ప్రతాపం

Sep 15 2016 12:11 AM | Updated on Sep 4 2017 1:29 PM

మంథని : గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న భక్తులపై పోలీసులు ప్రతాపం చూపించారు. కమాన్‌పూర్‌ మండలం సెంటనరీకాలనీ ముల్కలపల్లికి చెందిన గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు మంథని వద్ద గల గోదావరిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు.

మంథని : గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న భక్తులపై పోలీసులు ప్రతాపం చూపించారు. కమాన్‌పూర్‌ మండలం సెంటనరీకాలనీ ముల్కలపల్లికి చెందిన గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు మంథని వద్ద గల గోదావరిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. అనంతరం నదిలో స్నానాలు చేస్తున్నారు. వారిని బయటకు రావాలని ఎస్సై ఉపేందర్‌ సూచించారు. వారు వినిపించుకోలేదు. ఎస్సై వారి వద్దకు వెళ్లగా.. ఓ భక్తుడు ఎస్సైని పక్కకు నెట్టేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై వారిపై లాఠీ ఝుళిపించారు. గన్‌మన్‌ కూడా లాఠీతో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ సంఘటనలో మల్లేశ్‌ అనే భక్తుడి చేయికి గాయమైంది. దీంతో వివాదం చెలరేగింది. ఎస్సై చెప్పిన వెంటనే బయటకువచ్చామని, గన్‌మన్‌ తమపై ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. ఎస్సై ఉపేందర్‌ అక్కడి వచ్చి భక్తులకు నచ్చజెప్పారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement