అంతా గప్‌చుప్ | Kuppam airports item again | Sakshi
Sakshi News home page

అంతా గప్‌చుప్

Nov 16 2016 1:16 AM | Updated on Sep 4 2017 8:10 PM

అంతా గప్‌చుప్

అంతా గప్‌చుప్

ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఉన్న కుప్పం విమానాశ్రయు అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది.

శాంతిపురం: ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఉన్న కుప్పం విమానాశ్రయు అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది. నలుగురు సభ్యులున్న ఏవియేషన్ నిపుణుల బృందం మంగళవారం శాంతి పురం, రామకుప్పం మండలాల్లో పర్యటించింది. డిల్లీకి చెందిన మౌళిక వసతుల సంస్థ రైట్స్‌లో ఏవియేషన్ విభాగం సీనియుర్ డెప్యూటీ జనరల్ మేనేజర్ అభాస్ కుమార్, భోగాపురం విమానాశ్రయు జనరల్ మేనేజర్ రవికుమార్ మరో ఇద్దరు అధికారులు, కడా ఎస్వో శ్యాంప్రసాద్ క్షేత్రస్థారుు పరిశీలనలు జరిపారు. వీరి వెంట శాంతిపురం, రామకుప్పం తహశీల్దార్లు, సర్వేయుర్లు, రామకుప్పం మండల అధికార పార్టీ నాయుకులు ఉన్నారు.

శాంతిపురం మండలంలోని అమ్మవారిపేట, రామాపురం, వెంకటేష్‌పురం, రామకుప్పం మండలంలోని కిలాకిపోడు, విజలాపురం, కడిశనకుప్పం, మణీంద్రం ప్రాంతాల్లో భూములు, ఇతర భౌగోళిక అంశాలను ఈ బృందం పరిశీలించింది. రన్‌వే నిర్మాణానికి 5 కిలోమీటర్ల మేర భూములు కావాలని వారు అభిప్రాయుపడ్డారు. ఇందుకు అమ్మవారిపేట నుంచి రామకుప్పం మండలంలోని కృష్ణాపురం, గాంధీనగరం వరకూ భూములు అవసరమవుతాయుని తేల్చారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో శాంతిపురం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని గంటన్నర పాటు కార్యాలయు తలుపులు మూసివేశారు.

పనులపై వచ్చిన వారు తలుపులు తట్టి చప్పుడు చేయుటంతో అటెండర్లు అక్కడే నిలబడి అధికారులు భోజనం చేస్తున్నందున మళ్లీ రావాలని వచ్చిన వారిని వెనక్కు పంపారు. గంటన్నర పాటు రెవెన్యూ రికార్డులను పరిశీలించిన ఏవియేషన్ బృందం స్థానిక అధికారులకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. సర్వే, రికార్డుల పరిశీలనలకు సంబంధించిన వివరాలు వెల్లడించటానికి తహశీల్దార్ శ్రీనివాసులు నిరాకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement