breaking news
Kuppam airport
-
కుప్పం విమానాశ్రయానికి భూములు ఇవ్వం
‘‘మా ప్రాణాలైనా వదులుకుంటాం గానీ భూములు ఇచ్చేది లేదు’’ అంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో ‘విమానాశ్రయం నిర్మాణ భూ సేకరణకు సంబంధించిన అంశంతో సంబంధమున్న’ రైతులు తేల్చి చెప్పారు. జాయింట్ కలెక్టర్ (జేసీ) విద్యాధరి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వెంకట్‌సాయి తదితర అధికారులు గురువారం శాంతిపురం మండల కేంద్రంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం కోసం ఉద్దేశించిన మూడు (దండికుప్పుం, తర్టీసొన్నేగానిపల్లి, అమ్మవారిపేట) రెవెన్యూ గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా 23 మందిలో 17 మంది రైతులు తమ భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. భూములు ఇవ్వాలని అధికారులు తమను వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని జేసీ దృష్టికి తెచ్చారు. – శాంతిపురంవివిధ గ్రామాల రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..వేధిస్తున్నారు..మర్యాదగా భూమి ఇస్తే ఎకరాకు రూ 16 లక్షల పరిహారం ఇస్తామని, కోర్టుకు పోతే రూ.10 లక్షలు మాత్రమే ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారు. మాకు ఉన్న 85 సెంట్లలో వ్యవసాయం, పశుపోషణతో ముగ్గురు ఆడబిడ్డలను చదివిస్తున్నాం. ప్రాణం పోయినా భూములు ఇవ్వం. మమ్మల్ని వదిలేయండి. – పద్మమ్మ, సిద్దారెడ్లపల్లిఎలా బతకాలి?మా అన్నదమ్ముల రెండు కుటుంబాలకు ఉన్న ఏడు ఎకరాలను పూర్తిగా విమానాశ్రయానికి ఇచ్చి ఎలా బతకాలి. భూములు ఇవ్వటానికి మాతోసహా రైతులు ఎవరూ సిద్ధంగా లేరు. – కుమార్, సిద్దారెడ్లపల్లిఇచ్చేదే లేదు..ఏమి చేసినా, ఎంత పరిహారం ఇచ్చినా భూములు ఇచ్చేది లేదు. – వెంకటేష్, దండికుప్పంకూలీలుగా వలస పోవాలా?ఉన్న భూములను పోగొట్టుకుని రైతులు వలస కూలీలుగా వెళ్లాల్సిందేనా? వ్యవసాయంపై ఆధారపడ్డ మా కుటుంబంలోని 11 మంది భూములను కోల్పోయి బతకలేము. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే మేము ప్రభుత్వం నుంచి ఏమీ కోరుకోవటం లేదు. – జయప్పగౌడు, సిద్దారెడ్లపల్లిఎక్కడికి వెళ్లాలి..?వ్యవసాయం, మామిడి తోటలతో కుటుంబాన్ని లాక్కొస్తూ కొడుకును చదివిస్తున్నా మా భూమిని వదిలి ఎక్కడికి వెళ్లాలి. ప్రభుత్వం డబ్బుల రూపంలో ఇచ్చే పరిహారం ఖర్చయిపోతే, లేదా పిల్లలు లాక్కుంటే తల్లిదండ్రులు దిక్కులేని వారిగా మారతారు. – లక్ష్మి, దండికుప్పం -
చంద్రబాబును గెలిపించడమే మా తప్పు.. కుప్పంలో రైతుల ఆగ్రహం
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూటమి సర్కార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు దిగింది. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. చంద్రబాబును గెలిపించినందుకు తమకు తగిన బుద్ధి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టింది. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది. శాంతిపురం మండలం దండికుప్పంలో బలవంతంగా భూసేకరణకు కూటమి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రెవెన్యూ అధికారులు అక్కడ భూమిని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో, రెవెన్యూ అధికారులను రైతులు అడ్దుకున్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబును గెలిపిస్తున్నందుకు మాకు తగిన బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం.. ఎకరాకు 16 లక్షలు ఇస్తామని రైతులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమను ప్రశ్నిస్తే, కోర్టులకు వెళ్తే రూ.10లక్షలు మాత్రమే ఇస్తామని రెవెన్యూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.కాగా, కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం 1405 ఎకరాలు భూ సేకరణ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణకు దిగింది. ఇప్పటికే 458 ఎకరాలు భూమి సేకరించింది. అదనపు భూమి కోసం రైతులను వేధింపులకు గురిచేస్తోంది. -
మా ప్రాణాలు తీసి... భూములు తీసుకోండి
‘మేం బతికుంటే భూములను వదులుకోలేం. ముందుగా మా ప్రాణాలు తీసేయండి. ఆనక మా భూములు తీసుకోండి..’ అంటూ ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయ నిర్వాసిత రైతులు స్పష్టంచేశారు. కుప్పంలో విమానాశ్రయం కోసం భూముల సేకరణపై చర్చలకు కుప్పం ప్రాంతీయ అభివృద్ధి మండలి(కడ) ప్రాజెక్ట్ ఆఫీసర్, ఆర్డీవో వస్తారని తెలిసి రైతులు శాంతిపురం మండలంలోని దండికుప్పం–అమ్మవారిపేట మధ్య ఉన్న పొలాల వద్దకు చేరారు. అక్కడికి వచ్చిన తహసీల్దారు శివయ్య ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. నలుగురు రైతులు పురుగులమందు డబ్బాలతో వచ్చి.. ‘భూమి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే తలా కొంత తాగి చస్తాం’ అని హెచ్చరించారు. బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే దానికి ముందుగానే తమకు సమాధులు కట్టాల్సివస్తుందని రైతులు తేల్చి చెప్పారు. మర్యాదగా భూములు ఇస్తే ఎకరాకు రూ.16 లక్షలు, అడ్డం చెబితే రూ.10 లక్షలు ఇస్తామని, కోర్టుకు పోతే రూపాయి కూడా రాదని అధికారులు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ భూములు విమానాశ్రయానికి ఇవ్వడానికి సిద్ధంగా లేమని దండికుప్పానికి చెందిన మహిళా రైతు మురుగమ్మ చెప్పారు. ప్రభుత్వం బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా తమ ప్రాణాలు తీసేయాలని తహసీల్దారును కోరారు. ఉన్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ, మిగతా సమయంలో తాను కూలీగా, తన భర్త డ్రైవర్‌గా పనిచేస్తూ వచ్చిన సొమ్ముతో ముగ్గురు బిడ్డలను చదివిస్తున్నామని తెలిపారు. తమకు ఆధారంగా ఉన్న భూమిని కోల్పోతే కుటుంబం బతకడం కష్టమని కన్నీటిపర్యంతమయ్యారు. కూలీల సాయంతో తమకు ఉన్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భర్త, డిగ్రీ చదువుతున్న కొడుకును పోషిస్తున్నానని దండికుప్పానికి చెందిన లక్ష్మి చెప్పారు. ఊపిరి ఉన్నంతవరకూ భూమిని వదులుకోబోమని ఆమె స్పష్టంచేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. – శాంతిపురంగ్రామాలను తుడిచేస్తున్నారు శాంతిపురం–రామకుప్పం మండలాల సరిహద్దులో టైడిల్ సిల్క్ పరిశ్రమ కోసం 1995లో 175 ఎకరాలు తీసుకున్నారు. మళ్లీ ఇదే ప్రాంతంలో ఎయిర్‌పోర్టు కోసమని 2005లో 1,040 ఎకరాలు తీసుకున్నారు. ఆ భూముల్లో ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. మళ్లీ ఎయిర్పోర్ట్ పేరుతోనే ఇంకో 1,400 ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దండికుప్పం, సిద్దారెడ్లపల్లి, పాలెంగట్టు, వెంకటేష్ పురం, అమ్మవారిపేట, కృషే్ణపల్లి గ్రామాలను పూర్తిగా తుడిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. – జంగం చక్రపాణిరెడ్డి, దండికుప్పం ఓట్లేయించినందుకు భూములు లాక్కొంటున్నారు నేను టీడీపీ నాయకుడిని. అందరికీ చెప్పి చంద్రబాబుకు ఓట్లు వేయించాను. దానికి ప్రతిఫలంగా నా భూమి, మా గ్రామస్తుల భూములు లాక్కొంటున్నారు. ఇది నియంతృత్వ పాలన. ప్రజాపాలన కాదు. తరతరాలుగా జీవనాధారమైన భూములపై రైతులకు ఎలాంటి హక్కు, అధికారం లేవా ? నాకున్న 75 సెంట్లలో వ్యవసాయం చేసుకుంటూ, ఆవులను పెంచుకుంటూ సంతోషంగా బతుకుతున్నాం. ఆ భూమి కోల్పోతే మా కుటుంబం నాశనమవుతుంది. రైతుల అభిప్రాయంతో సంబంధం లేకుండా బలవంతంగా భూములు లాక్కుంటామంటే ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?. – సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకుడు, సిద్దారెడ్లపల్లి -
అంతా గప్‌చుప్
శాంతిపురం: ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఉన్న కుప్పం విమానాశ్రయు అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది. నలుగురు సభ్యులున్న ఏవియేషన్ నిపుణుల బృందం మంగళవారం శాంతి పురం, రామకుప్పం మండలాల్లో పర్యటించింది. డిల్లీకి చెందిన మౌళిక వసతుల సంస్థ రైట్స్‌లో ఏవియేషన్ విభాగం సీనియుర్ డెప్యూటీ జనరల్ మేనేజర్ అభాస్ కుమార్, భోగాపురం విమానాశ్రయు జనరల్ మేనేజర్ రవికుమార్ మరో ఇద్దరు అధికారులు, కడా ఎస్వో శ్యాంప్రసాద్ క్షేత్రస్థారుు పరిశీలనలు జరిపారు. వీరి వెంట శాంతిపురం, రామకుప్పం తహశీల్దార్లు, సర్వేయుర్లు, రామకుప్పం మండల అధికార పార్టీ నాయుకులు ఉన్నారు. శాంతిపురం మండలంలోని అమ్మవారిపేట, రామాపురం, వెంకటేష్‌పురం, రామకుప్పం మండలంలోని కిలాకిపోడు, విజలాపురం, కడిశనకుప్పం, మణీంద్రం ప్రాంతాల్లో భూములు, ఇతర భౌగోళిక అంశాలను ఈ బృందం పరిశీలించింది. రన్‌వే నిర్మాణానికి 5 కిలోమీటర్ల మేర భూములు కావాలని వారు అభిప్రాయుపడ్డారు. ఇందుకు అమ్మవారిపేట నుంచి రామకుప్పం మండలంలోని కృష్ణాపురం, గాంధీనగరం వరకూ భూములు అవసరమవుతాయుని తేల్చారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో శాంతిపురం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని గంటన్నర పాటు కార్యాలయు తలుపులు మూసివేశారు. పనులపై వచ్చిన వారు తలుపులు తట్టి చప్పుడు చేయుటంతో అటెండర్లు అక్కడే నిలబడి అధికారులు భోజనం చేస్తున్నందున మళ్లీ రావాలని వచ్చిన వారిని వెనక్కు పంపారు. గంటన్నర పాటు రెవెన్యూ రికార్డులను పరిశీలించిన ఏవియేషన్ బృందం స్థానిక అధికారులకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. సర్వే, రికార్డుల పరిశీలనలకు సంబంధించిన వివరాలు వెల్లడించటానికి తహశీల్దార్ శ్రీనివాసులు నిరాకరించారు.