
విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం
విద్యార్థుల బలిదానాలు చూసే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, అలాంటి రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్‌ను విస్మరించడం
టీఆర్‌ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ నేత కుంతియా ధ్వజం
హుజూర్‌నగర్: విద్యార్థుల బలిదానాలు చూసే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, అలాంటి రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్‌ను విస్మరించడం సిగ్గుచేటని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా విమర్శించారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల భేటీలో ఆయన పాల్గొ న్నారు. రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందన్నారు.
రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అవినీతికరమైనదిగా అభివర్ణించారు. పాలకుల విధానాల వల్ల రైతులు, విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు.