ఇసుక రీచ్ల్లో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు | ktr sudden Check up in karimnagar district | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్ల్లో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు

Aug 1 2016 12:45 PM | Updated on Sep 4 2017 7:22 AM

ఇసుక రీచ్ల్లో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు

ఇసుక రీచ్ల్లో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు

కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచ్ల్లో మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచ్ల్లో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొత్తపల్లి ఇసుకరీచ్లో కూలీలు, డ్రైవర్లతో కేటీఆర్ ముచ్చటించారు. మైనింగ్ జరుగుతున్న తీరు, ఇసుక తరలింపుపై ఆయన ఆరా తీశారు. ఇదే విధంగా ఇతర జిల్లాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు. మైనింగ్ జాతీయ సంపద అని, అక్రమాలను సహించేది లేదని కేటీఆర్ స్పష్టంచేశారు.

పర్మిట్ ఉన్నా రాత్రివేళల్లో ఇసుక రవాణా నిషేధం అని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. అక్రమ దందాను అరికట్టాలంటే రెవిన్యూ, పోలీసు, మైనింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement