కర్నూలు అభివృద్ధిలో కోట్లది కీలకపాత్ర | kotla play lead role in kurnool development | Sakshi
Sakshi News home page

కర్నూలు అభివృద్ధిలో కోట్లది కీలకపాత్ర

Sep 18 2016 11:46 PM | Updated on Sep 4 2017 2:01 PM

కర్నూలు అభివృద్ధిలో కోట్లది కీలకపాత్ర

కర్నూలు అభివృద్ధిలో కోట్లది కీలకపాత్ర

కర్నూలు అభివృద్ధిలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మీరెడ్డి కొనియాడారు.

– డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మీరెడ్డి
– ఘనంగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల జన్మదిన వేడుకలు
– శుభాకాంక్షలు తెలిపిన టీజీ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు అభివృద్ధిలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మీరెడ్డి కొనియాడారు. ఆదివారం స్థానిక రివర్‌వ్యూ కాలనీలోని కోట్ల  నివాసానికి పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  డీసీసీ ఆధ్వర్యంలో వేద పండితులతో ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు కోట్లతో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం లక్ష్మీ‡రెడ్డి మాట్లాడుతూ కోట్ల కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు టౌన్‌గా ఉన్న రైల్వేస్టేçÙన్‌ను సిటీగా మార్చారని, ఇంటర్‌సిటీరైలు, నంద్యాలకు ప్యాసింజర్‌ ట్రై న్, కృష్ణానగర్, బిర్లాగేటు వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జీలు  మంజూరు చేయించారని తెలిపారు. టీడీపీ నేత,రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్,  జెడ్పీ మాజీ చైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ కార్యదర్శి సర్దార్‌ బుచ్చిబాబు, పార్టీ మైనారిటీసెల్‌ చైర్మన్‌ అహ్మద్‌అలీఖాన్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు పూడూరు నాగమధు యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్‌. ఖలీల్‌బాష, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, చున్నుమియ్య, ఇమాంపటేల్, ఆర్టీఐ చైర్మన్‌ సుదర్శన్‌రెడ్డి తదితరులు కోట్లను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement