కిరోసిన్‌ పోసి తగులబెట్టేందుకు యత్నం | Kerosene Put On women trys to Fire in maddipadu | Sakshi
Sakshi News home page

కిరోసిన్‌ పోసి తగులబెట్టేందుకు యత్నం

Aug 10 2016 5:08 PM | Updated on Jul 30 2018 8:41 PM

తనను, తనబిడ్డను కిరోసిన్‌ పోసి తగులబెట్టటానికి ప్రత్యర్థులు ప్రయత్నించినట్లు ప్రకాశం జిల్లాలోని ఇనమనమెళ్లూరు ఎంపీసీ నగర్‌కు చెందిన మేకల సుభాషిణి మద్దిపాడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

మద్దిపాడు (సంతనూతలపాడు): తనను, తనబిడ్డను కిరోసిన్‌ పోసి తగులబెట్టటానికి ప్రత్యర్థులు ప్రయత్నించినట్లు ప్రకాశం జిల్లాలోని ఇనమనమెళ్లూరు ఎంపీసీ నగర్‌కు చెందిన మేకల సుభాషిణి మద్దిపాడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల మేరకు ఎంపీసీ నగర్‌లో నివాసం ఉంటున్న మేకల సుభాషిణి కుటుంబానికి అదే కాలనీకి చెందిన తుపాకుల రమణమ్మ, ఆమె కుమారుడు ఆంజనేయులుకు స్థలాల విషయంలో గతంలో గొడవలు జరిగాయి.

ఈ నేపథ్యంలో తన భర్త బయటి గ్రామంలో పనుల కోసం వెళ్లగా, సుభాషిణితో వారు ఇరువురు గొడవ పడ్డారు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న తమపై కిరోసిన్‌ పోసి నిప్పుంటించటంతో మంటలకు చంటి బిడ్డను తీసుకుని పరుగులు తీసినట్లు సుభాషిణి పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement