జాతీయ స్థాయి పోటీలకు సమాయత్తం | kabaddy | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు సమాయత్తం

Apr 6 2017 12:30 AM | Updated on Sep 5 2017 8:01 AM

జాతీయ స్థాయి పోటీలకు సమాయత్తం

జాతీయ స్థాయి పోటీలకు సమాయత్తం

జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు రాజానగరం మండలం, పాతతుంగపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానం శిక్షణాప్రాంగణమైంది. మండలంలో మారుమూల గ్రామంగా ఉన్న ఈ ప్రాంతంలో జిల్లా కబడ్డీ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు ముగింపు దశకు చేరాయి.

  • పాత తుంగపాడులో కబడ్డీ శిక్షణ
  • జాతీయ స్థాయి పోటీలకు సమాయత్తం
  •  
    రాజానగరం :
    జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు రాజానగరం మండలం, పాతతుంగపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానం శిక్షణాప్రాంగణమైంది. మండలంలో మారుమూల గ్రామంగా ఉన్న ఈ ప్రాంతంలో  జిల్లా కబడ్డీ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు ముగింపు దశకు చేరాయి. పది రోజులుగా ఇక్కడ జరుగుతున్న ఏపీ 28వ సబ్‌ జూనియర్స్‌ జాతీయ కబడ్డీ శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఎంపిక చేసిన 20 మంది క్రీడాకారులు కోచ్‌ జగదీష్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారని పీఈటీ షేక్‌ మహబూబ్‌ షరీప్‌ తెలిపారు. ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలపాటు ఈ శిక్షణ జరుగుతుందన్నారు. 15 రోజుల శిక్షణ అనంతరం తమిళనాడులోని కోయంబత్తూరులో ఈనెల 13, నుంచి 16 వరకు జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో వీరు పాల్గొంటారు. 
     

Advertisement
 
Advertisement
Advertisement