ఉత్సాహంగా కబడ్డీ పోటీలు | kabaddi competitions | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా కబడ్డీ పోటీలు

Jan 15 2017 11:59 PM | Updated on Sep 5 2017 1:17 AM

ఉత్సాహంగా కబడ్డీ పోటీలు

ఉత్సాహంగా కబడ్డీ పోటీలు

నరసాపురం: నరసాపురంలోని రుస్తుంబాదలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పురుషుల, మహిళల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.

నరసాపురం: నరసాపురంలోని రుస్తుంబాదలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పురుషుల, మహిళల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. స్టేడియంలో ఉదయం, రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో రెండు సెషన్స్‌ లో పోటీలు నిర్వహిస్తున్నా రు. పురుషులు, మహిళలకు సంబంధించి మొత్తం 32 జట్లు పోటీపడుతున్నాయి. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కోర్టుల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం పురుషుల విభాగంలో ఆంధ్రా జట్టు పూనేపై 21 పాయింట్ల తేడాతో, హర్యానా జట్టు ఢిల్లీపై 35 పాయింట్ల తేడాతో, పంజాబ్‌ జట్టు, కోల్‌కతాపై 12 పాయింట్ల తేడాతో గెలుపొందాయి. మహిళల విభాగంలో ఢిల్లీ జట్టు పంజాబ్‌పై ఒక్క పాయింట్‌ తేడాతో, పూనె జట్టు ఢిల్లీపై 17 పాయింట్ల తేడాతో, నోయిడా జట్టు కోల్‌కతాపై 34 పాయింట్ల తేడాతో గెలుపొందాయి. శనివారం సాయంత్రం నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీల కన్వీనర్‌ కొత్తపల్లి జానకీరామ్, కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.రంగారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement