
సాక్షి,పశ్చిమ గోదావరి జిల్లా: వినాయక చవితి ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలలోని తూర్పుతాళ్ళు అనే గ్రామంలో డాన్స్ చేస్తున్న యువకులపై ఓ ట్రాక్టర్ దూసుకెళ్ళింది. ఈ దుర్ఘటనలో ప్రమాదవశాత్తు ట్రాక్టరు క్రింద పడి నలుగురు మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు. బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం నరసాపురం ఆస్పత్రికి తరలించారు.
మృతులు తూర్పు తాళ్ళు గ్రామానికి చెందిన తిరుమల నరసింహమూర్తి , జి మురళి, ఇమన సూర్యనారాయణ,దినేష్ పోలీసులు గుర్తించారు. గాయపడ్డ మరో ఇద్దరు క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మొగల్తూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.