దుర్గమ్మ సన్నిధిలో న్యాయమూర్తులు | justices viisit durga temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో న్యాయమూర్తులు

Dec 3 2016 10:32 PM | Updated on Sep 4 2017 9:49 PM

దుర్గమ్మ సన్నిధిలో న్యాయమూర్తులు

దుర్గమ్మ సన్నిధిలో న్యాయమూర్తులు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శనివారం పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, అడ్మినిస్ట్రేషన్‌ ట్రిబ్యునల్‌ వైస్‌ చైర్మన్‌ వై.రామకృష్ణ, రైల్వేకోర్టు న్యాయమూర్తి రామచంద్రరావు అమ్మను దర్శించుకున్న వారిలో ఉన్నారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శనివారం పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, అడ్మినిస్ట్రేషన్‌ ట్రిబ్యునల్‌ వైస్‌ చైర్మన్‌ వై.రామకృష్ణ,  రైల్వేకోర్టు న్యాయమూర్తి రామచంద్రరావు అమ్మను దర్శించుకున్న వారిలో ఉన్నారు. తొలుత వీరికి ఆలయ  అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలు ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement