శేష వాహనంపై జంబుకేశ్వరుడు | jambukeswarudu on seshavahanam | Sakshi
Sakshi News home page

శేష వాహనంపై జంబుకేశ్వరుడు

Apr 7 2017 11:51 PM | Updated on Sep 5 2017 8:11 AM

పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి స్వామి వారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

రాయదుర్గం టౌన్‌ : పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి స్వామి వారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. స్వామివారి శేషవాహనాన్ని కోట, వినాయక సర్కిల్‌ మీదుగా నేసేపేట వరకు ఊరేగించారు. అక్కడి నుంచి తిరిగి స్వామి వారి వాహనం ఆలయానికి చేరుకుంది. శనివారం స్వామి కైలాస వాహనోత్సవం, ఆదివారం కల్యాణోత్సవం ఉంటుందని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement