ఎమ్మెల్యేపై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్‌ | its demand to put nirbhaya case on mla | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్‌

Dec 6 2016 10:46 PM | Updated on Sep 4 2017 10:04 PM

ఎమ్మెల్యేపై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్‌

ఎమ్మెల్యేపై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్‌

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు కదం తొక్కారు. జన చైతన్య యాత్రలో భాగంగా ఎమ్మెల్యే మాధవనాయుడు నరసాపురం మండలం కంసాలి బేతపూడి గ్రామానికి వెళ్లగా, గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న మహిళలపై ఆయన ఆనుచరులు అమానుష దాడికి దిగిన విషయం విదితమే.

నరసాపురంలో ప్రదర్శన నిర్వహించిన మహిళలు
 
నరసాపురం :
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు కదం తొక్కారు. జన చైతన్య యాత్రలో భాగంగా ఎమ్మెల్యే మాధవనాయుడు నరసాపురం మండలం కంసాలి బేతపూడి గ్రామానికి వెళ్లగా, గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న మహిళలపై ఆయన ఆనుచరులు అమానుష దాడికి దిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన మంగళవారం నరసాపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం, జనసేన పార్టీల నాయకులు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలను కొట్టించిన రౌడీ ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయాలని రాసిన ప్లకార్డులు పట్టుకుని.. రౌడీ ప్రభుత్వం నశించాలంటూ మహిళలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేపైన, ఆయన అనుచరులపైన నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement