పాదరక్షలతో జనసేన ఎమ్మెల్యే దీక్ష? | Janasena MLA Battula Balaramakrishna Faces Criticism Over Footwear During Chandhi Deeksha Event In Rajanagaram | Sakshi
Sakshi News home page

పాదరక్షలతో జనసేన ఎమ్మెల్యే దీక్ష?

Jul 2 2026 8:25 AM | Updated on Jul 2 2026 9:54 AM

Battula Balarama Krishna Chandi Deeksha Controversy

తూర్పు గోదావరి జిల్లా: సనాతన ధర్మం గురించి జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఊగిపోతూ స్పీచులిస్తూంటారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. వివరా­లివీ.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ  పాదరక్షలు ధరించి చండీ దీక్షలో ఉండటం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతోంది. 

రాజానగరం మండలం దివాన్‌ చెరువులో బుధవారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీలో పార్టీ శ్రేణులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల పాల్గొన్నారు. అయితే, ఆ సమయంలో ఆయన పాదరక్షలు ధరించి ఉండటం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దేవాలయాలకు వెళ్లిన సమయంలో పలు విమర్శలు గుప్పించే కూటమి నేతలు హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement