breaking news
battula
-
పాదరక్షలతో జనసేన ఎమ్మెల్యే దీక్ష?
తూర్పు గోదావరి జిల్లా: సనాతన ధర్మం గురించి జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఊగిపోతూ స్పీచులిస్తూంటారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాదరక్షలు ధరించి చండీ దీక్షలో ఉండటం సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. రాజానగరం మండలం దివాన్ చెరువులో బుధవారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీలో పార్టీ శ్రేణులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల పాల్గొన్నారు. అయితే, ఆ సమయంలో ఆయన పాదరక్షలు ధరించి ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దేవాలయాలకు వెళ్లిన సమయంలో పలు విమర్శలు గుప్పించే కూటమి నేతలు హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
25న దళితగర్జన
హుస్నాబాద్ : కరీంనగర్‌లోని కళాభారతిలో ఈనెల 25న దళితగర్జన నిర్వహిస్తున్నట్లు దళిత జేఏసీ రాష్ట్ర చైర్మన్ బత్తుల చంద్రమౌళి తెలిపారు. ఈ సందర్భంగా దళిత ప్రజాప్రతినిధులను సన్మానించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేసి, కాలనీల్లో కమ్యూనిటీ భవనాలను నిర్మించాలన్నారు. నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, దళిత జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గడిపె కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల సంపత్, నాయకులు అన్నపు సత్యం, బత్తుల రవీందర్, శ్రీను, రాజయ్య, రాజేందర్ పాల్గొన్నారు.


