చాంద్బాషా చేరికతో అనంతలో ముసలం | internal disputes in anantapur district tdp | Sakshi
Sakshi News home page

చాంద్బాషా చేరికతో అనంతలో ముసలం

Apr 23 2016 1:27 PM | Updated on Aug 10 2018 9:42 PM

చాంద్బాషా చేరికతో అనంతలో ముసలం - Sakshi

చాంద్బాషా చేరికతో అనంతలో ముసలం

అనంతపురం టీడీపీలో ముసలం మొదలైంది. కదిరి ఎమ్మెల్యే చాంద్బాషా చేరికతో అసమ్మతి తీవ్రస్థాయిలో చెలరేగింది.

విజయవాడ : అనంతపురం టీడీపీలో ముసలం మొదలైంది. కదిరి ఎమ్మెల్యే చాంద్బాషా చేరికతో అసమ్మతి తీవ్రస్థాయిలో చెలరేగింది. చాంద్బాషా చేరికపై కదిరి టీడీపీ ఇంఛార్జ్ కందికుంట ప్రసాద్... టీడీపీ నాయకులపై నిప్పులు చెరుగుతున్నారు. చాంద్బాషా చేరిక నేపథ్యంలో ఈ రోజు ఉ. 9.30 గంటలకు సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో టీడీపీ అగ్రనేతలు...ప్రసాద్తో మంతనాలు సాగించారు. దీంతో ఆయన్ని శాంత పరిచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మంత్రి పరిటాల సునీత జోక్యం చేసుకుని... ప్రసాద్ను చంద్రబాబు వద్దకు స్వయంగా తీసుకునివెళ్లారు. చాంద్ బాషా చేరికపై చంద్రబాబు ఎదుటే ప్రసాద్ అసంతృప్తి వ్యక్త చేశారు. దీంతో చాంద్ బాషా చేరిక ప్రక్రియ పూర్తికాకుండానే ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement