రైతు ఆత్మహత్యలపై అధికారుల విచారణ | inquiry on farmers suicides | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలపై అధికారుల విచారణ

Aug 4 2016 11:13 PM | Updated on Sep 29 2018 7:10 PM

రైతు ఆత్మహత్యలపై అధికారుల విచారణ - Sakshi

రైతు ఆత్మహత్యలపై అధికారుల విచారణ

రైతు ఆత్మహత్యలపై గురువారం చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్‌, డీఎస్పీ శృతకీర్తి మండల పరిధిలో జరిగిన రైతు ఆత్మహత్యలపై విచారణ చేపట్టారు.

పూడూరు: రైతు ఆత్మహత్యలపై గురువారం చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్‌, డీఎస్పీ శృతకీర్తి మండల పరిధిలో జరిగిన రైతు ఆత్మహత్యలపై విచారణ చేపట్టారు. మండల పరిధిలో గతేడాది పూడూరు గ్రామానికి చెందిన రాము అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు గురువారం గ్రామంలో ఆత్మహ్యతకు గల కారణాలు, ఎలా జరిగింది, అప్పులు ఎన్ని ఉన్నాయని కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. గతంలో అప్పులు ఇచ్చిన వారిని పిలిపించి వారి వివరాలు నమోదు చేసుకున్నారు. చిన్న చిన్న విషయాలకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని ప్రభుత్వం అన్ని విధాల రాయితీలను అందిస్తోందని తెలిపారు. ఆర్డీఓ వెంట పూడూరు సర్పంచ్‌ యాదమ్మ, ఆర్‌ఐ మహేష్‌, నాయకులు తాజోద్దీన్‌, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్‌, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement