గుండెపోటుతో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి | Infosys employee dies of heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి

Jul 20 2016 7:15 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఇన్ఫోసిస్ కు చెందిన ఐటీ ఉద్యోగి రవి చంద్రన్(30) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు.

ఘట్‌కేసర్‌లోని కల్కి ప్రేవేటు ఆసుపత్రిలో రవి చంద్రన్(30) అనే యువ ఐటీ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందాడు. ఘట్‌కేసర్ మండలం పోచారం వద్ద నున్న ఇన్ఫోసిస్ కంపెనీలో రవికొంతకాలంగా పనిచేస్తున్నాడు. బుధవారం పనిలో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. రవి చంద్రన్ స్వస్థలం తమిళనాడులోని వేలూరు.
 

Advertisement
 
Advertisement
Advertisement