రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | In Road Accident one man dead | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Oct 16 2016 10:39 PM | Updated on Aug 13 2018 3:11 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

మండల కేంద్రంలోని చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారిపై వడ్లపల్లె క్రాస్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు.

సంబేపల్లె : మండల కేంద్రంలోని చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారిపై వడ్లపల్లె క్రాస్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. పీలేరు వైపు నుంచి రాయచోటి వైపు వస్తున్న నిస్సాన్‌మైక్రా కారు,  రాయచోటి నుంచి సంబేపల్లెకు వస్తున్న టీవీఎస్‌ ద్విచక్రవాహనంను ఢీ కొంది. దీంతో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న సంబేపల్లె మండల కేంద్రం అంబేడ్కర్‌ కాలనీకి చెందిన సాకిబండ వెంకటరమణ, ఆయన భార్య రాజమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డి వాహనంలో రాయచోటి ఆసుప్రతికి తరలించారు. వెంకటరమణ పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. వెంకటరమణ సంబేపల్లె పోస్టాఫీసులో బట్వాడా విభాగంలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement