నదీ జలాలను శుద్ధి చేయాలని మౌనదీక్ష | hunger strick for rivers clean | Sakshi
Sakshi News home page

నదీ జలాలను శుద్ధి చేయాలని మౌనదీక్ష

Jul 19 2016 7:03 PM | Updated on Sep 4 2017 5:19 AM

గోదావరి, కృష్ణా నదీ జాలాలను శుద్ధి చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి 25 వరకు కాళేశ్వరంలో మౌనదీక్ష చేపట్టనున్నట్లు వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరుకు చెందిన గాదెపాక రాములుస్వామి తెలిపారు. మంగళవారం ఆయన కాళేశ్వరం గోదావరి వద్ద విలేకర్లతో మాట్లాడారు.

కాళేశ్వరం : గోదావరి, కృష్ణా నదీ జాలాలను శుద్ధి చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి 25 వరకు కాళేశ్వరంలో మౌనదీక్ష చేపట్టనున్నట్లు వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరుకు చెందిన గాదెపాక రాములుస్వామి తెలిపారు. మంగళవారం ఆయన కాళేశ్వరం గోదావరి వద్ద విలేకర్లతో మాట్లాడారు. కాళేశ్వరం, ధర్మపురి, బాసర, భద్రాచలంతోపాటు ఇతర పుణ్యక్షేత్రాల్లోని నదులు మలినాలు, వ్యర్థాలతో కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి నదీ జలాలను శుద్ధి చేయడంతోపాటు భవిష్యత్తులో జలాలు కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement