హెడ్‌ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి | head constables training completed | Sakshi
Sakshi News home page

హెడ్‌ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి

Sep 21 2016 11:40 PM | Updated on Sep 4 2017 2:24 PM

తిరుపతిలోని కళ్యాణ్‌డ్యామ్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో హెడ్‌కానిస్టేబుల్‌ శిక్షణ పూర్తి చేసుకున్న 56 మంది కానిస్టేబుళ్లు బుధవారం కర్నూలుకు చేరుకున్నారు.

కర్నూలు: తిరుపతిలోని కళ్యాణ్‌డ్యామ్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో హెడ్‌కానిస్టేబుల్‌ శిక్షణ పూర్తి చేసుకున్న 56 మంది కానిస్టేబుళ్లు బుధవారం కర్నూలుకు చేరుకున్నారు. సాయంత్రం ఎస్పీ ఆకె రవికృష్ణను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగంలో 25 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి ఐదున్నరేళ్ల క్రితం వీరు సివిల్‌ విభాగంలోకి కన్వర్షన్‌ అయ్యారు. వీరికి మే 23 నుంచి ఈ నెల 17వ తేదీ వరకు తిరుపతి కళ్యాణ్‌ డ్యామ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ శిక్షణనిచ్చారు. మారుతున్న చట్టాలు, నూతన ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం వీరు జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో పని చేస్తున్నారు. హెడ్‌ కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్నందున్న త్వరలో వీరికి స్టేషన్లను కేటాయించనున్నారు. ఓఎస్‌డీ రవిప్రకాష్, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ వెంకటేష్, ఆర్‌ఐలు రంగముని, జార్జీలతో కలిసి వీరంతా ఎస్పీని కలిశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement