జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ‘ఒంటిపూట బడి’ నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం పేర్కొన్నారు.
అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ‘ఒంటిపూట బడి’ నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయన్నారు.ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగించాలన్నారు.వేసవి నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ఈ క్రమంలో పిల్లలను దృష్టిలో ఉంచుకొని కేంద్రాల పని వేళల్లో మార్పు చేసినట్లు చెప్పారు.


