ఈడ్చుకెళ్లి.. చెట్టుకు కట్టేసి.. | Villagers tie Anganwadi teacher to tree over husband alleged fraud | Sakshi
Sakshi News home page

ఈడ్చుకెళ్లి.. చెట్టుకు కట్టేసి..

Apr 9 2026 9:13 AM | Updated on Apr 9 2026 12:43 PM

Villagers tie Anganwadi teacher to tree over husband alleged fraud

కంగ్టి (నారాయణఖేడ్‌): ఓ అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసి మానసికంగా వేధించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని రాసోల్‌ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ సిద్ద దుర్గారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న పట్లోళ్ల వసంతకుమారి (61) భర్త హెచ్‌బీఎన్‌ బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వలేదనే నెపంతో స్థానికులు మంగళవారం ఈ దారు ణానికి ఒడిగట్టారు. 

బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విష యం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అవుటి సాయవ్వ, చాకలి బాలమణి బలవంతంగా తనను ఈడ్చుకెళ్లగా.. తాను ప్రాధేయ పడినా వదలకుండా అవుటి బండెప్ప, కోట గిరి రాములు, భుతాలే వైద్యనాథ్‌ చెట్టుకు కట్టే శారని వసంతకుమారి పేర్కొ న్నారు. దాదాపు గంటకుపైగా తనను వేధించినట్లు బాధితు రాలు వాపోయింది. జుట్టు గొరిగి, బొట్లు పెట్టి గాడిదపై ఊరేగిస్తామని బెదిరింపులకు గురిచేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దుర్గారెడ్డి తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement