గురుభ్యోనమః | gurupournami in anantapur | Sakshi
Sakshi News home page

గురుభ్యోనమః

Jul 9 2017 11:22 PM | Updated on Jun 1 2018 8:39 PM

గురుభ్యోనమః - Sakshi

గురుభ్యోనమః

హిందూ సమాజంలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. ప్రతి మనిషికీ వివేకం, విచక్షణ, వితరణ ఈ మూడింటినీ అందించగలిగే వారే గురువు.

హిందూ సమాజంలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. ప్రతి మనిషికీ వివేకం, విచక్షణ, వితరణ ఈ మూడింటినీ అందించగలిగే వారే గురువు. ఒక అంశాన్ని మనకు బోధించి, ఆ రంగంలో జ్ఞానాన్ని ప్రసాదించేవారందరూ గురువులే. గురు అంటే మాయను నిర్మూలించి, జ్ఞాన మార్గాన్ని నడిపించేవారని అర్థం. ఇది కేవలం ఆధ్యాత్మిక భావనతోనే చెప్పినదికాదు. ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజును హిందువులు గురుపౌర్ణమి రోజుగా పాటిస్తారు. ఈ పర్వదినాన గురువును ప్రతి ఒక్కరూ ఆరాధిస్తే శుభాలు కలుగుతాయని ప్రతీతి. జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, సాయి సత్యవ్రతాలు జరిగాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ కమిటీలు, దాతలు భక్తులకు అన్నదానం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement