ప్రతి ఇంటికీ తాగురందించడమే ప్రభుత్వ లక్ష్యం
హాలియా: ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఆప్కాబ్ ఛైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి అన్నారు.
హాలియా: ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఆప్కాబ్ ఛైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గరికనేటితండా పంచాయతీ పరిధిలో గల ఎర్రగట్టుతండాలో రూ.4.25 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ మోటర్, ఓవర్‌హెడ్ ట్యాంకును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్‌భగీరథతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలోని ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఎం.సి కోటిరెడ్డి, ఎంపీపీ నాగమణి, ఎంపీడీఓ జానయ్య, లింగారెడ్డి, రంగసాయినాయక్, ఎంపీటీసీ పెదమైసయ్య, పెద్దిరాజు, రమణరాజు, రాములు, బాలునాయక్, కిషన్, కుర్ర బాలు, రమేష్ పాల్గొన్నారు.