మరో ఇద్దరు అధికారుల సస్పెన్షన్
ఇండోర్: తాగునీటి కాలుష్యంతో మరణాలు సంభవించిన నేపథ్యంలో ఇండోర్ మున్సిపల్ కమిషనర్‌ను తొలగించినట్లు శుక్రవారం సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మరో ఇద్దరు అధికా రులపై సస్పెన్షన్ విధించామన్నారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ యాదవ్‌ను విధుల నుంచి తొలగించడంతోపాటు అదనపు మున్సిపల్ కమిషనర్ రోహిత్ సిస్సోనియా, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ (ప్రజా రోగ్యం) సంజీవ్ శ్రీవాస్తవను సస్పెండ్ చేసినట్లు సీఎం ఎక్స్‌లో ప్రకటించారు.


