సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వ బదిలీలు చేపట్టింది. తెలంగాణవ్యాప్తంగా 40 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సర్కార్ కీలక మార్పులు చేపట్టింది.
జీహెచ్‌ఎంసీలో పలువురు కమిషనర్లు, మేనేజర్లకు కొత్త బాధ్యతలను అప్పగించింది. రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, భైంసా మున్సిపాలిటీల్లో బదిలీలు చోటుచేసుకున్నాయి. కాగా, వెంటనే కొత్త పోస్టింగ్‌లకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలస్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బదిలీలు ఇలా..
రాజేష్ కుమార్ ప్రమోషన్‌తో GHMC కి బదిలీ
టీ.ఎస్.వి.ఎన్. త్రిలేశ్వర రావు C&DMA హెడ్ ఆఫీస్ కు బదిలీ
బి. సత్యనారాయణ రెడ్డి ప్రమోషన్‌పై GHMC కి బదిలీ
ఆర్. వెంకట గోపాల్.. గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్
ఉమా మహేశ్వర రావు - ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
పి. రామాంజుల రెడ్డి - మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్
బి. తిరుపతి - కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ (ప్రమోషన్)
చ. నాగరాజు - నేరెడ్‌చర్ల మున్సిపల్ కమిషనర్
వై. సుదర్శన్ - ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్
C.V.N. రాజు - రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీ
కె. సమ్మయ్య - సచివాలయానికి రిపాట్రియేషన్
కీర్తి నాగరాజు - రాయకల్ మున్సిపల్ కమిషనర్
ఏ. శ్రీనివాస రెడ్డి - హాలియా మున్సిపల్ కమిషనర్
ఎం. నూరుల్ నజీబ్ - అమర్‌చింత మున్సిపల్ కమిషనర్
కె. సంపత్ కుమార్ - వెనులవాడ మున్సిపల్ కమిషనర్
టి. రమేష్ - ములుగు మున్సిపల్ కమిషనర్
ఎం. రామచంద్ర రావు - తిరుమలగిరి (OD)
జి. రాజు - ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్
మునావర్ అలీ - ఎదులాపురం మున్సిపల్ కమిషనర్
జె. సంపత్ - బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్
పి. చంద్రశేఖర్ రావు - భూత్‌పూర్ మున్సిపల్ కమిషనర్
డి. మురళి - నందికొండ మున్సిపల్ కమిషనర్
చి. వేణు - ఆచంపేట్ మున్సిపల్ కమిషనర్
ఎం. రామదుర్గ రెడ్డి - కల్లూరు మున్సిపల్ కమిషనర్


