ఆటోలో మహిళ వద్ద 13 కాసుల బంగారం చోరీ | gold stolen from women in auto | Sakshi
Sakshi News home page

ఆటోలో మహిళ వద్ద 13 కాసుల బంగారం చోరీ

Nov 23 2016 12:17 AM | Updated on Sep 4 2017 8:49 PM

తణుకు : ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు కాజేసిన ఘటన తణుకులో మంగళవారం జరిగింది.

తణుకు : ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు కాజేసిన ఘటన తణుకులో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరుకు చెందిన దొంగ నాగలక్ష్మి ఇటీవల బంధువుల ఇంటికి పోడూరు మండలం కవిటం వచ్చింది. మంగళవారం తిరుగు ప్రయాణంలో నాగలక్ష్మి కవిటంలో తణుకు వెళ్లే ఆటో ఎక్కింది. బంగారు ఆభరణాలు ధరిస్తే ఎవరైనా దొంగిలిస్తారన్న భయంతో 13 కాసుల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు బ్యాగులో పెట్టుకుంది. తణుకు బస్టాండు వద్ద ఆటో దిగిన ఆమె బ్యాగ్‌ కత్తిరించి ఉండటంతో అనుమానం వచ్చి తెరిచి చూసింది. బ్యాగులో ఉంచిన బంగారం, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పట్టణ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement