బంగారు గొలుసు అపహరణ | Gold chain theft | Sakshi
Sakshi News home page

బంగారు గొలుసు అపహరణ

Dec 20 2016 12:24 AM | Updated on Jun 1 2018 8:39 PM

కదిరి టౌన్‌ : నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును అగంతకులు లాక్కెళ్లారు. పట్టణంలోని అడపాల వీధిలో నివాసముంటున్న గంగులమ్మ ఆర్‌అండ్‌బీ బంగ్లాలో స్వీపర్‌గా పనిచేస్తోంది. సోమవారం విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను అటకాయించారు.

కదిరి టౌన్‌ : నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును అగంతకులు లాక్కెళ్లారు. పట్టణంలోని అడపాల వీధిలో నివాసముంటున్న గంగులమ్మ ఆర్‌అండ్‌బీ బంగ్లాలో స్వీపర్‌గా పనిచేస్తోంది. సోమవారం విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను అటకాయించారు. మెడలోని గొలుసును లాక్కొంటుండగా గంగులమ్మ ప్రతిఘటించి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేలోపు ఆ యువకులు గొలుసు లాక్కొని ఆమెను కిందకు తోసేసి ఉడాయించారు.  గాయపడిన బాధితురాలిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement