గోదావరికి వరదపోటు | godavariki varada potu | Sakshi
Sakshi News home page

గోదావరికి వరదపోటు

Sep 15 2016 1:54 AM | Updated on Sep 4 2017 1:29 PM

గోదావరిలో మళ్లీ వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలోకి వచ్చి చేరే ప్రవాహం ఎక్కువైంది. రెండు రోజుల నుంచి క్రమేణా నీటిమట్టం పెరుగుతోంది. గోష్పాదక్షేత్రం ఘాట్‌లోని కింది మెట్లు పూర్తిగా నీట మునిగాయి. బుధవారం సాయంత్రం ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 4.15 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు తొమ్మిది వేల క్యూసెక్కుల

కొవ్వూరు : గోదావరిలో మళ్లీ వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలోకి వచ్చి చేరే ప్రవాహం ఎక్కువైంది. రెండు రోజుల నుంచి క్రమేణా నీటిమట్టం పెరుగుతోంది. గోష్పాదక్షేత్రం ఘాట్‌లోని కింది మెట్లు పూర్తిగా నీట మునిగాయి. బుధవారం సాయంత్రం ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 4.15 లక్షల  క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement