నాగర్‌కర్నూల్ : రెండో ఏఎన్‌ఎంలకు పదవ పీఆర్సీ ప్రకారం వేతనాలివ్వాలని పీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు రామయ్య, రెండో ఏఎన్‌ఎంల జిల్లా అధ్యక్షురాలు సుగుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పదవ పీఆర్సీ ప్రకారం వేతనాలివ్వాలి
Jul 21 2016 12:30 AM | Updated on Sep 4 2017 5:29 AM
నాగర్‌కర్నూల్ : రెండో ఏఎన్‌ఎంలకు పదవ పీఆర్సీ ప్రకారం వేతనాలివ్వాలని పీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు రామయ్య, రెండో ఏఎన్‌ఎంల జిల్లా అధ్యక్షురాలు సుగుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలని కోరుతూ చేస్తున్న నిరవదిక దీక్షలో భాగంగా బుధవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ప్రకారం విధులు చేయించడం లేదని, జిల్లా స్థాయి సమావేశాలకు వెళ్లినా టీఏ, డీఏలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు కృష్ణలీల, లక్ష్మినర్సమ్మ, జలజా, కళావతి, హైమావతి, శీరదేవి, అరుణ, రేణుక తదితరులు పాలొన్నారు.
Advertisement


