న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో కీలకమైన డిస్‌ప్లే అసెంబ్లీలు, లిథియం అయాన్ సెల్స్, ఇండక్షన్ కాయిల్ మాడ్యూల్స్‌కి బేసిక్ కస్టమ్స్ సుంకాల (బీసీడీ) నుంచి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్, స్మార్ట్ టీవీల్లాంటి ఎల్రక్టానిక్ డివైజ్‌లను దేశీయంగా తయారు చేసేలా ప్రోత్సహించేందుకు ఇది దోహదపడనుంది.
డిస్‌ప్లే అసెంబ్లీలు, మాడ్యూల్స్‌పై మినహాయింపు 2029 మార్చి 31 వరకు వర్తిస్తుందని కేంద్రం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. దేశీయంగా లిథియం అయాన్ సెల్ తయారీలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బ్యాటరీ గిగాఫ్యాక్టరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీదార్లు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ కంపెనీలు, డేటా సెంటర్లు మొదలైనవి గణనీయంగా లబ్ధి పొందగలవని పేర్కొన్నాయి.


