స్టైలిష్ లుక్.. రోజంతా కంఫర్ట్.. మార్కెట్లోకి కొత్త శాండల్స్! | Sparx Launches Chunky Sole Sandals Know The Details | Sakshi
Sakshi News home page

స్టైలిష్ లుక్.. రోజంతా కంఫర్ట్.. మార్కెట్లోకి కొత్త శాండల్స్!

Jul 9 2026 8:37 PM | Updated on Jul 9 2026 9:04 PM

Sparx Launches Chunky Sole Sandals Know The Details

ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదు.. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ప్రతి అంశం అందులో భాగమైంది. ముఖ్యంగా ఫుట్‌వేర్ విషయంలో యువత స్టైల్‌తో పాటు సౌకర్యానికీ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మారుతున్న ఫ్యాషన్ ధోరణులను దృష్టిలో ఉంచుకుని దేశంలోని ప్రముఖ యువ ఫుట్‌వేర్ బ్రాండ్ స్పార్క్స్ (Sparx) కొత్త ‘చంకీ సోల్ శాండల్స్’ కలెక్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

అంతర్జాతీయ ఫ్యాషన్ ట్రెండ్‌ల స్ఫూర్తితో రూపొందించిన ఈ శాండల్స్ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు రోజంతా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలు, వీకెండ్ ట్రిప్స్, వెకేషన్లు లేదా సాధారణ వినియోగం.. ఇలా అన్ని సందర్భాల్లో ఉపయోగించుకునేలా వీటిని డిజైన్ చేశారు. మందంగా ఉండే చంకీ సోల్, స్పోర్టీ లుక్, బలమైన మెటీరియల్, ఆధునిక రంగుల కలయిక ఈ కలెక్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జీన్స్, కార్గో ప్యాంట్లు, షార్ట్స్ వంటి దుస్తులకు కూడా సులభంగా మ్యాచ్ అయ్యేలా వీటిని రూపొందించారు.

శాండల్స్‌లో అడ్జస్టబుల్ స్ట్రాప్స్ ఉండటంతో పాదాలకు సరైన ఫిట్ లభిస్తుంది. మెరుగైన కుషనింగ్, తక్కువ బరువుతో రూపొందించడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ధరించినా సౌకర్యంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. స్టైల్ కోసం కంఫర్ట్‌ను, కంఫర్ట్ కోసం స్టైల్‌ను వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త కలెక్షన్‌ను రూపొందించామని స్పార్క్స్ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement