అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?

Apple Steve Jobs rugged old sandals for auction with whopping amount - Sakshi

న్యూఢిల్లీ: యాపిల్‌ కో ఫౌండర్‌  స్టీవ్ జాబ్స్ ధరించిన  పాత,  అరిగిపోయిన చెప్పులు ఆన్‌లైన్‌లో  వేలానికి ఉంచారు. 1970, 80ల  కాలంలో ఆయన వేసుకున్న  బ్రౌన్ స్వెడ్ లెదర్ బిర్కెన్‌స్టాక్ అరిజోనా చెప్పులను వేలానికి ఉంచింది. వీటి 60వేలు- 80 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ. 48లక్షల నుంచి 64 లక్షలకు పైనే) ధర నిర్ణయించారని వేలం జూలియన్స్ ఆక్షన్స్‌  నిర్వాహకుడు వెల్లడించారు.

ఇదీ చదవండి:  యాపిల్‌ గుడ్‌న్యూస్‌: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!
 
ఈ వేలం నవంబర్ 11న మొదలు కాగా,  నవంబర్ 13న ముగియనుంది. మార్క్ షెఫ్, స్టీవ్ జాబ్స్ హోమ్ మేనేజర్, 1980 లలో కాలిఫోర్నియాలోని అల్బానీలో బిర్కెన్‌స్టాక్ చెప్పులను భద్రపరిచారు. జూలియన్స్ వేలం వెబ్‌సైట్‌లోని తాజా సమాచారం ప్రకారం, బిడ్ 15 వేల డాలర్ల వద్ద వద్ద ప్రారంభమై 22,500 డాలర్ల వద్ద ఉంది.  బిడ్‌ గెలిచిన వాళ్లు చెప్పులతోపాటు, చెప్పుల ఎన్‌ఎఫ్‌టీని కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫోటోగ్రాఫర్ జీన్ పిగోజీ బుక్‌"ది 213 మోస్ట్ ఇంపార్టెంట్ మెన్ ఇన్ మై లైఫ్" ను కూడా దక్కించుకోవచ్చు.  (క్యూ కడుతున్న టాప్‌ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్‌ మస్క్‌!)

ఆయనకి ప్రత్యేకంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు, సాధారణంగా ఉంటూనే, అత్యాధునిక టెక్నాలజీపై దృష్టి పెట్టేవారని వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  స్టీవ్‌ జాబ్స్‌ మాజీ భార్య క్రిస్సన్ బ్రెన్నాన్ తెలిపారు. స్టీవ్ జాబ్స్ వార్డ్‌రోబ్ లో చెప్పులు కూడా ఉండేవి. అవి ఆయన యూనిఫాంలో భాగం.  ఒక బిజినెస్‌ మేన్‌గా  స్పెషల్‌గా  కంటే కూడా సింపుల్‌ డిజైన్,  చెప్పులు కంఫర్ట్‌గా ఉన్నాయో లేదో మాత్రమే ఆలోచించేవారని ఆమె గుర్తు  చేసుకున్నారు. 

యాపిల్ చరిత్రలో అనేక కీలకమైన క్షణాల్లో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులను ధరించినట్లు వేలం సంస్థ పేర్కొంది. 1976లో సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి లాస్ ఆల్టోస్ గ్యారేజీలో యాపిల్ కంప్యూటర్ ఆవిష్కరణ సందర్భంగా ఇదే చెప్పులను ధరించారట.  మరోవైపు ఈ సాండిల్స్‌ను   ఇప్పటికే పలుఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శించారు. 2017లో ఇటలీలోని మిలన్‌లో సలోన్ డెల్ మొబైల్, 2017లో జర్మనీలోని రహ్మ్స్‌లోని బిర్కెన్‌స్టాక్ హెడ్‌క్వార్టర్స్, న్యూయార్క్‌లోని సోహోలో, జర్మనీలోని కొలోన్‌లో IMM కోల్న్ ఫర్నిచర్ ఫెయిర్ వంటి అనేక ప్రదర్శనలలో  వీటిని ఉంచారు.  అలాగే 2018లో Die Zeit మ్యాగజైన్ కోసం Zeit ఈవెంట్ బెర్లిన్,ఇటీవల, జర్మనీ స్టట్‌గార్ట్‌లోని ది హిస్టరీ మ్యూజియం వుర్టెంబర్గ్‌లో  ఉంచడం విశేషం.  (హ్యుందాయ్‌ భారీ ఆఫర్‌, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్‌)

కాగా ఫాదర్ ఆఫ్ డిజిటల్ రివల్యూషన్‌, స్టీవ్‌జాబ్స్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1976లో యాపిల్‌ సంస్థను నెలకొల్పి కోట్లాదిమంది అభిమానులతో యాపిల్‌ మ్యాక్స్‌, ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు, యాపిల్‌ వాచెస్‌..ఇలా యాపిల్‌ అనే బ్రాండ్‌ను  విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. అందుకే రోడ్లపై పడేసిన కోక్ బాటిల్స్ అమ్ముకునే స్థాయినుంచి గ్లోబల్‌ టెక్‌ లీడర్‌గా ఎదిగిన ఆయన ప్రస్తానం పలువురికి స్ఫూర్తిదాయకం. గతంలో చార్టర్‌ఫీల్డ్స్ వేలం వేసిన స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు సుమారు రూ.1.6 కోట్లకు విక్రయించబడింది. ఇదే ఉద్యోగ దరఖాస్తు 2018  ఏడాది నిర్వహించిన ఆక్షన్‌లో సుమారు రూ.1.2 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top