డెంగీతో చిన్నారి మృతి | Girl died suffering from dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో చిన్నారి మృతి

Jul 2 2017 12:08 AM | Updated on Sep 28 2018 3:41 PM

రాయదుర్గం : పట్టణంలోని తహసీల్దార్‌ రోడ్డులో నివాసముంటున్న అల్తాఫ్‌ కూతురు ఆయేషా (6) శనివారం డెంగీ జ్వరంతో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న అల్తాఫ్‌ పెద్ద కూతురు అయిన ఆయేషాకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది.

రాయదుర్గం : పట్టణంలోని తహసీల్దార్‌ రోడ్డులో నివాసముంటున్న అల్తాఫ్‌ కూతురు ఆయేషా (6) శనివారం డెంగీ జ్వరంతో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న అల్తాఫ్‌ పెద్ద కూతురు అయిన ఆయేషాకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు బళ్లారికి తీసుకెళ్లాలని సూచించారు. గురువారం బళ్లారి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా రక్త పరీక్షలు చేసిన వైద్యులు ప్లేట్‌ లెట్స్‌ తగ్గిపోయాయని చెప్పారు. వారి సూచన మేరకు తిరిగి విమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షించి డెంగీ జ్వరంగా నిర్ధారించారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆయేషా శనివారం ఉదయం ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో మృతి చెందింది. పాప మృతికి ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ మేనేజర్‌ సంతాపం తెలిపి.. రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement