అక్టోబర్‌లో గాయత్రి మహాయాగం | gayathri mahayagam in october | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో గాయత్రి మహాయాగం

Aug 1 2016 7:53 PM | Updated on Sep 4 2017 7:22 AM

జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్‌ 16వ తేది నుంచి 5 రోజుల పాటు గాయత్రి మహాయాగాన్ని నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు జ్యోషి రఘురాం చారి తెలిపారు.

జోగిపేట: జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్‌ 16వ తేది నుంచి 5 రోజుల పాటు గాయత్రి మహాయాగాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జ్యోషి రఘురాం చారి తెలిపారు. అందోల్‌లోని రామాలయంలో సోమవారం బ్రాహ్మణ సంఘం జిల్లా, తాలుకా నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధన కోసం ఈ మహాయాగం చేస్తున్నామన్నారు. ఈమేరకు జిల్లాకు చెందిన బ్రాహ్మణ సంఘాల నాయకులతో తీర్మానం చేశామని చెప్పారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా, నాయకులు చంద్రశేఖర్‌, కృష్ణారావు, దత్తాత్రేయ శర్మ, హనుమంతాచార్య, ప్రవీణ్‌శర్మ, భాస్కర్‌శర్మ, మృత్యుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు.
గాయత్రి మహాయాగం, అక్టోబర్‌, బ్రాహ్మణ సంఘం

Advertisement
 
Advertisement
Advertisement