నలుగురు నయీం అనుచరులు అరెస్ట్ | Four nayim Followers arrested | Sakshi
Sakshi News home page

నలుగురు నయీం అనుచరులు అరెస్ట్

Sep 11 2016 10:55 AM | Updated on Mar 28 2018 11:26 AM

గ్యాంగ్‌స్టర్ నయీం గ్యాంగ్‌కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గ్యాంగ్‌స్టర్ నయీం గ్యాంగ్‌కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 40 ఎకరాల స్థలాన్ని కాజేయడానికి యత్నించిన నలుగురు ముఠాను మెదక్ జిల్లా పటాన్‌చెరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరికి చెందిన 40 ఎకరాల భూమిని తమ పెరు పైకి మార్చాలని నయీం అనుచరులు ప్రతాప్, నరేందర్, మహేష్, అశోక్ ఉద్యోగ సంఘం నేత రవీందర్‌గౌడ్‌ను బెదిరించారు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement