ఆర్టీసీ బస్సు బోల్తా : నలుగురికి తీవ్రగాయాలు | four injured in bus accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా : నలుగురికి తీవ్రగాయాలు

Sep 27 2016 11:31 PM | Updated on Sep 4 2017 3:14 PM

ఆర్టీసీ బస్సు బోల్తా : నలుగురికి తీవ్రగాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా : నలుగురికి తీవ్రగాయాలు

గోరంట్ల మండలం మల్లాపల్లి వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు.

హిందూపురం అర్బన్‌ / గోరంట్ల : గోరంట్ల మండలం మల్లాపల్లి వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఏపీ02 టీడీ 0667 నంబరు హిందూపురం డిపో ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి హిందూపురం వస్తోంది. ఈక్రమంలో మల్లాపల్లి సమీపంలో జెడ్‌ టర్నింగ్‌ రైట్‌ సైడ్‌ తిప్పుతుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో డ్రైవర్‌ అశ్వర్థ బస్సును అదుపు చేసే లోపు బోల్తా పడింది.

ప్రమాదంలో కర్ణాటక ఆదినారాయణకొండ సోమిరెడ్డిపల్లికి చెందిన లక్ష్మినారాయణ, మల్లాపల్లికి చెందిన లక్ష్మిదేవి, నరసింహులు, తిరుపతికి చెందిన రామ్మూర్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ వారం రోజుల నుంచి 600 కి లోమీటర్లు రోజూ ఇదే రూట్‌లో డ్యూటీ చేశారు. వన్‌మన్‌ సర్వీస్‌ కావడంతో తీవ్ర ఒత్తిడికి కూడా గురైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున వెంటనే డిపో మేనేజర్‌ గోపినాథ్, యూనియన్‌ నాయకులు సంఘటన ప్రదేశానికి వెళ్లి పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement