చేప కాదు.. కొండ చిలువ చిక్కింది! | fisherman caught unfortunately a python instead of fish | Sakshi
Sakshi News home page

చేప కాదు.. కొండ చిలువ చిక్కింది!

Oct 28 2016 7:32 PM | Updated on Oct 9 2018 4:44 PM

చేపలు పట్టేందుకు ఓ జాలరి వల విసరగా కొండచిలువ చిక్కింది.

కొల్చారం: చేపలు పట్టేందుకు ఓ జాలరి వల విసరగా కొండచిలువ చిక్కింది. ఈ అరుదైన ఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామ సమీపంలోని మంజీర వాగులో చేపలు పడుతున్న ఓ జాలరి వలకు కొండచిలువ చిక్కింది. దాదాపు 10 ఫీట్ల వరకు ఉన్న కొండచిలువను మరికొందరు వ్యక్తులతో కలిసి గట్టుపైకి చేర్చారు. సమీపంలోని చెట్ల పొదల్లోకి వదిలేసినట్లు స్థానికలు తెలిపారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement