నెల్లూరు(పొగతోట) : కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న ఏటీఎంలో ప్రమాదం తప్పింది. వివరాలు.. మంగళవారం ఉదయం షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏటీఎంలో విద్యుత్ వైర్లు తగలబడ్డాయి.
ఏటీఎంలో తప్పిన ప్రమాదం
Jul 26 2016 6:07 PM | Updated on Oct 20 2018 6:19 PM
నెల్లూరు(పొగతోట) : కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న ఏటీఎంలో ప్రమాదం తప్పింది. వివరాలు.. మంగళవారం ఉదయం షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏటీఎంలో విద్యుత్ వైర్లు తగలబడ్డాయి. మంటలు సీలింగ్‌కు అంటుకున్నాయి. దీనిని గుర్తించిన సెక్యూరిటీగార్డు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేసి తగలబడుతున్న సిలింగ్‌ను ఆర్పాడు. సంఘటనా స్థలాన్ని ఏటీఎంల మేనేజర్ పిలిప్స్ పరిశీలించారు. గార్డు సకాలంలో స్పందించడంతో భారీనష్టం తప్పిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏటీఎంకు మరమ్మతులు చేసి రెండురోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
Advertisement
Advertisement