కర్నూలు జిల్లా ఉల్లిందకొండలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయిబాబా టైరోటెక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కర్నూలు: కర్నూలు జిల్లా ఉల్లిందకొండలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయిబాబా టైరోటెక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గ్యాస్ లీకవడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఫైరింజన్లు ఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పాయి.