పూల మార్కెట్లో అగ్నిప్రమాదం | fire accident in gudi malkapur in rangareddy | Sakshi
Sakshi News home page

పూల మార్కెట్లో అగ్నిప్రమాదం

Jan 7 2016 6:00 AM | Updated on Apr 3 2019 7:53 PM

పూలమార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభవించి నాలుగు దుకాణాలు కాలి బూడిదయ్యాయి.

హైదరాబాద్: పూలమార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభవించి నాలుగు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన నగరంలోని గుడిమల్కాపుర్ పూల మార్కెట్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో.. సమీపంలో ఉన్న 20 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement