‘హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు’ | "Filmed murder suicide ' | Sakshi
Sakshi News home page

‘హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు’

Jan 9 2017 10:47 PM | Updated on Nov 6 2018 7:53 PM

తమ కుమార్తెను అల్లుడే కొట్టి చంపి.. ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాడని ఓడీచెరువు మండలం బసప్పగారిపల్లికి చెందిన సరస్వతి తల్లి లక్ష్మిదేవి ఆరోపించారు. సోమవారం సాయంత్రం కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట బంధువులతో కలిసి సరస్వతి మృతదేహంతో ఆందోళన నిర్వహించారు.

కదిరి టౌన్‌ : తమ కుమార్తెను అల్లుడే కొట్టి చంపి.. ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాడని ఓడీచెరువు మండలం బసప్పగారిపల్లికి చెందిన సరస్వతి తల్లి లక్ష్మిదేవి ఆరోపించారు. సోమవారం సాయంత్రం కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట బంధువులతో కలిసి సరస్వతి మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. ఆదివారం ఉదయం సరస్వతి తనకు ఫోన్‌ చేసి, భర్త వేధిస్తున్నాడని వాపోయిందని తెలిపారు. ఆ తర్వాత గంట సేపటికే బావిలో శవమై తేలిందని, ఆమె శరీరంపై రక్తగాయాలు ఉన్నాయని, పరిసర ప్రాంతం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. తమకు సమాచారం అందించకుండానే పోస్టుమార్టం పూర్తి చేయడం కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. అందుకే తాము మృతదేహాన్ని తీసుకెళుతున్న జీపును అడ్డుకుని, ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా న్యాయం చేస్తామని పోలీసులు తెలపడంతో శాంతించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement