విజయవాడలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.
విజయవాడ: విజయవాడలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా రైతులు ఆందోళన చేపట్టారు. భూములు ఇవ్వని ఉండవల్లి, పెనుమాక రైతుల పోలాల్లో రోడ్డు మార్కింగ్ పిల్లర్లు వేశారంటూ సీఆర్డీఏ అధికారులపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ భూముల జోలికి రావొద్దని కోర్టు చెప్పినా.. అధికారులు భూమలివ్వాలంటూ తమను బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.