కల్తీ మద్యం షాపుపై ఎక్సైజ్ దాడులు | excise attacks on Adulterated alcohol shop | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం షాపుపై ఎక్సైజ్ దాడులు

Jun 19 2016 6:46 PM | Updated on Sep 5 2018 8:43 PM

మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేటలో కల్తీ మద్యం విక్రయిస్తున్న ఓ షాపుపై ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు.

మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేటలో కల్తీ మద్యం విక్రయిస్తున్న ఓ షాపుపై ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. లక్ష్మీ నరసింహ వైన్ షాపులో సీల్ వేసి ఉన్న మద్యం బాటిళ్ల నుంచి కొంత మేర మద్యాన్ని వేరు చేసి ఆ మేరకు నీరు కలిపి విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. నీరు కలిపిన తొమ్మిది బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైన్ షాపుపై, నిర్వాహకులు నర్సింగ్ గౌడ్, బాబులపై కేసులు నమోదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement