
క్రీడల్లో రాణించాలి
పెద్దవూర: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక న్యూవిజన్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జూనియర్ కళాశాలల జిల్లా స్థాయి అండర్–19 వాలీబాల్ సెలక్షన్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.