‘తెలంగాణ తిరుపతిగా యాదాద్రి’ | esl narasimhan visit yadadri temple | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ తిరుపతిగా యాదాద్రి’

Jan 6 2017 3:10 PM | Updated on Aug 11 2018 7:56 PM

‘తెలంగాణ తిరుపతిగా యాదాద్రి’ - Sakshi

‘తెలంగాణ తిరుపతిగా యాదాద్రి’

తెలంగాణ తిరుపతిగా యాదాద్రి అభివృద్ధి చెందుతుందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు.

యాదాద్రి: తెలంగాణ తిరుపతిగా యాదాద్రి అభివృద్ధి చెందుతుందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన యాదాద్రి లక్ష్మీనార సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ను తిలకించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ...రానున్న రోజుల్లో ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా యాదాద్రి మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్‌ టౌన్‌ గా యాదాద్రి ముందుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత గవర్నర్‌ నాలుగోసారి యాదాద్రికి వచ్చారు. తొలిసారిగా బాలాలయాన్ని సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement