నెల్లూరులో స్వల్ప భూకంపం | earthquake in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరులో స్వల్ప భూకంపం

Oct 17 2015 10:13 PM | Updated on Oct 20 2018 6:19 PM

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో శనివారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది.

వరికుంటపాడు(నెల్లూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో శనివారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. వరికుంటపాడు మండలంలోని గణేశ్వరాపురం, రామదేవులపాడు, కడియంపాడు గ్రామాలలో ఈ రోజు రాత్రి స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. ఉదయగిరి, దుత్తలూరులలో కూడా భూమి కంపించింది. ఇంట్లో ఉన్న పాత్రలు స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఐదు నిమిషాల వ్యవధిలో మూడు సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement