భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో.. | distressed over wife leaving him alone, man commits suicide | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో..

Dec 15 2016 7:50 PM | Updated on Nov 6 2018 7:53 PM

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖమ్మం: భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం మొడికట్ట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ(45) మద్యానికి బానిసై భార్య సత్యవతితో తరచు గొడవ పడుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement